స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే
- పది రూపాయల మేర తగ్గిన పసిడి
- అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలోపేతం ప్రభావం
- 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.51 లక్షలకు పైగా
దేశీయ మార్కెట్‌లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధాన నగరాల్లో 24, 22, 18 క్యారెట్ల బంగారంపై పది రూపాయల చొప్పున తగ్గింది. నిన్న పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 160, 22 క్యారెట్లపై రూ. 150, 18 క్యారెట్లపై రూ. 120 చొప్పున ధరలు తగ్గగా, నేడు అన్ని విభాగాల్లోనూ పది గ్రాముల బంగారంపై రూ. 10 మేర స్వల్ప తగ్గుదల నమోదైంది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,360గా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,38,740 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,520 వద్ద ట్రేడ్ అవుతోంది. మంగళవారంతో పోలిస్తే ఈ ధరలు స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో స్థానిక పన్నులను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా తగ్గుదల ధోరణే కనిపిస్తోంది. పసిడి బాటలోనే వెండి ధరల్లో కూడా పరిమితమైన కదలికలు నమోదయ్యాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ముంబై, ఢిల్లీలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,51,360 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ. 1,38,740 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ. 1,13,520 వద్ద ట్రేడ్ అవుతోంది.